ఏపీ రాజధాని అంశం సినిమా తారలకు తగిలింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఉద్యమం నడుస్తుంటే సినిమా నటులు స్పందించకపోవటంపై ఆగ్రహించిన ఏపీ విద్యార్థి యువజన పోరాట సమితి హీరో మహేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది.
తన సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్‌లో భాగంగా మహేష్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు కానీ రాజధాని అంశంపై నోరు విప్పటం లేదని విద్యార్థి సంఘం నేతలు మండిపడుతున్నారు. ఇండస్ట్రీ స్పందించకపోతే సంక్రాంతి సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.