టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఏపీ ప్రభుత్వం పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. గత మూడేళ్లలో ఏపీలో ఎన్నో ఆరాచకాలు జరిగాయని … దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు,కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు,కార్యకర్తలపై దాడులు జరిగాయని అన్నారు.
భూ కబ్జాలు, మైనింగ్ మాపియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు ఇలా జగన్ పాలన సాగుతోందన్నారు. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని… ఈ సారి కచ్చితంగా చంద్రబాబే ఏపీకి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
కేవలం మూడే సంవత్సరాలలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు జగన్ నైజం ఆయన అసమర్థ పాలన గురించి అర్థమైపోయిందన్నారు. బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కడమే కాదు, ఈ సారి తమ పార్టీ గెలిచే పరిస్థితి లేనే లేదని వారే స్వయంగా చెబుతున్నారని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
మరోవైపు బీసీలపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనంతపురం రాప్తాడు పూలకుంటలో రజకులపై వైసీపీ నేత నరసింహారెడ్డి కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. డబ్బులివ్వకుండా బట్టలు ఉతకాలంటూ వేధింపులకు దిగడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన పై చర్యలు తీసుకోవాలన్నారు. రజకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గత మూడేళ్లలో దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు కార్యకర్తలపై దాడులు, భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి, లక్షల కోట్లలో ప్రభుత్వం
(1/3) pic.twitter.com/w5kyquPBoX— Kinjarapu Atchannaidu (@katchannaidu) August 2, 2022