కింజారపు అచ్చెన్నాయుడు,
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
సైకోగా మారిన సీఎం జగన నుంచి నవ్యాంధ్రను కాపాడుకోవడమే ముఖ్య లక్ష్యం. ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర భవిషత్తును.. రాబోయే సాధారణ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. మేధావులైన పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజ్ఞతతో ఓటు వేసి సీఎం జగన నుంచి నవ్యాంధ్రను కాపాడుకోడానికి ముందుకు రావాలి. పట్టభద్రులను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి పశ్చిమ రాయలసీమ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి గోపాల్‌రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేయించాలి.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాలుగేళ్లలోనే జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత, వ్యాపారులు, రైతులు, కూలీలు, శ్రామికుల్లో పెరిగింది. శాశ్వతంగా తానే ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్ తమ లాంటి వారిని పార్టీ మారాలని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు.
ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు సారథ్యంలో టీడీపీ 160 స్థానాల్లో విజయం సాధిస్తుంది. కచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర తీవ్రంగా నష్టపోయింది. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రోడ్లు వేయలేదు, ఇళ్లు కట్టలేదు ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదు.
గత చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమం.. అభివృద్ధి సమానంగా నడిపింది. టీడీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో కేవలం రూ.2 వేల కోట్లే ఖర్చు చేసింది. రాష్ట్రంలో మద్యం షాపులు, తయారీ సంస్థలు జగనవే, రూ.4 వేల కోట్లు మద్యం స్కాం జరిగింది.
ఢిల్లీలో రూ.100 కోట్లు మద్యం స్కాంకే ఎందరో ఉద్దండులను అరెస్టు చేస్తే.. ఇక్కడెందుకు అరెస్టులు చేయడం లేదు. సైకో జగన్‌కు బుద్ధి చెప్పాలన్నా.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మేధావులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు విజ్ఞతతో ఓటు వేయాలి.చంద్రబాబు ఎంతో దూరదృష్టితో ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు, ఆయన విజన్‌న వల్ల ఐటీ రంగంలో అడుగు పెట్టి హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాల్లో ఉద్యోగాలు చేసే సాఫ్ట్‌వేరు ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు రాష్ట్రానికి వచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలి.
ఈ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదు. అందుకే మొదటి ప్యాధాన్యత ఓటు టీడీపీకి వేయాలి. రెండో ప్రాధాన్యత కింద పీడీఎఫ్ అభ్యర్థికి వేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలి. జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఏ ఒక్కరిని వదిలేదే లేదు.