కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు గురువారం టాప్ 7 రాష్ట్రాలకు ర్యాంకులను కేంద్రం వెల్లడించింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ లో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
టాప్ లో ఉన్న ఏడు రాష్ట్రాల్లో వరసగా ఏపీతో పాటు.. గుజరాత్, హర్యానా, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, తమిళనాడు లు ఉన్నాయి. అయితే.. దేశంలోని రాష్ట్రాలకు నాలుగు కేటగిరీలుగా ర్యాంకులు ప్రకటించినట్టు భారత ప్రభుత్వం పేర్కొంది.
ఇకపోతే.. ఒక దేశం లేదా ఒక ప్రాంతంలో కొత్తగా ఒక వ్యాపారం స్థాపించేందుకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా పరిగణిస్తారు. ఈ బిజినెస్ సూత్రానికి విశేష స్పందన రావడంతో.. మన దేశం కూడా దీనిపై దృష్టి సారించింది.
అదే సమయంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ అంశంలో పోటీ నిర్వహించి ర్యాంకింగ్ ఇస్తూ వస్తోంది భారత ప్రభుత్వం. దీంతో.. అటు రాష్ట్రాల్లోనూ ఈ అంశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంలో తెలుగు రాష్ట్రాలు మాత్రం తొలి అయిదు స్థానాల్లో నిలుస్తున్నాయి.