ఏపీ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ బిల్లురి నాగభూషణం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయవాడతో పాటు హైదరాబాద్ లోని అతని నివాసాలలో ఒకే సారి తనిఖీలు నిర్వహించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ లోని కావూరి హిల్స్.. నిజాంపేట.. మోయినాబాద్‌లోని ఫాంహోస్ లతో పాటు.. విజయవాడ పోరంకిలోని ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంటి స్థలం.. 5 ఇళ్లు.. జీ+5 ఫ్లోర్ బిల్డింగ్ తో పాటు 3 కార్లు, బైక్, వెండి, సుమారు రూ. 5.93 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దాదాపుగా రూ. 4.34 కోట్ల అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. దర్యాప్తు అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్టు అధికారులు వెల్లడించారు.