సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు బలైన బాలిక ఉదంతంపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. జిల్లా ఎస్పీతో కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వరుసగా టీడీపీ నేతల వేధింపులకు కారణం చంద్రబాబు వెనుకేసుకురావడమే అన్నారు వాసిరెడ్డి పద్మ. విజయవాడలో వినోద్ జైన్ కేసు సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు బుద్ధి చెప్పాల్సింది అన్నారు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్.
ఇలాంటి ఘటనలను మహిళా కమిషన్ సహించే ప్రసక్తే లేదన్నారు. కీచక టీడీపీ నేతలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాను అన్నారు. ఈ కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ నేత లైంగిక వేధింపుల వ్యవహారం కలకలంరేపింది. అతడి టార్చర్ తట్టుకోలేక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది.
కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన మైనర్ బాలికను టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. బాలికను ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక ఆరోపించింది. ఆమె ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసింది.. బాలిక ఇంటర్ చదువుతోంది. పరారీలో ఉన్న టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.