జాతి వివక్ష భారతదేశంలోనే కాదు. ప్రపంచమంతా పాతుకుపోయింది. కాలం మారినా వివక్ష పట్ల మనిషి స్వభావం మారలేదని చెప్తోంది..దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ సంఘటన. తమ కోసం కేటాయించిన స్విమ్మింగ్ పూల్‌లో స్నానాలు చేస్తున్న నల్లజాతి బాలురిపై అక్కడి తెల్లవారు జుట్టు పట్టుకుని లాగేశారు. గొంతు నులిమారు.
చెప్పుతో కొట్టారు. ఈ హటాత్‌పరిణామానికి చిన్నారులు నిశ్చేష్టులై ఉండిపోయారు. ఒక నల్లజాతి కుటుంబం క్రిస్మస్ సెలవుదినాలను సంతోషంగా జరుపుకునేందుకు దక్షిణాఫ్రికాలోని ఫ్రీ స్టేట్‌లోని మాసెల్స్‌పోర్ట్ రిసార్ట్‌కు వెళ్లింది.
అక్కడ ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో నల్లజాతి కుటుంబానికి చెందిన చిన్నారులు ఈత కొట్టేందుకు దిగారు. ఇది గమనించిన శ్వేతజాతీయులు ఇద్దరు మైనర్లను జుట్టు పట్టుకుని స్విమ్మింగ్ పూల్ నుంచి బలవంతంగా బయటకు లాగి పడేశారు. గొంతు నులిమారు. చెప్పుతో కొట్టినట్లు ఓ స్థానిక వార్తాపత్రిక కథనం.
A group of suspected white supremacists adult men, attacked some Black children at the MASELSPOORT RESORT & CONFERENCE CENTRE in Free State, South Africa, because the Black boys were swimming in a pool that is allegedly for whites only pic.twitter.com/uZUDXqdJAU
— Tariq Nasheed 🇺🇸 (@tariqnasheed) December 26, 2022
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేంత లోపే దాడికి పాల్పడిన వారు పారిపోయారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో 13 ఏండ్ల బాలుడిని చెప్పుతో కొడుతున్నది చూడొచ్చు.