జనగామ జిల్లాలోని రేణుక ఎల్లమ్మ బోనాల పండుగలో అపశృతి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బోనం ఎత్తగానే, తేనెటీగలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. దీంతో స్థానికులు పరుగులు పెట్టారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన వాహనంలోకి వెళ్లిపోయారు.
జాఫర్గడ్ మండలం ఉప్పు గల్లులో గౌడ సంఘం కులస్తులు ఆధ్వర్యంలో నిర్వహించే రేణుక ఎల్లమ్మ బోనాల పండుగకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు.
ఎమ్మెల్యే రాజయ్యకు అక్కడి స్థానిక మహిళలు బోనమెత్తారు. బోనం ఎత్తగానే ఒక్కసారిగా తేనెటీగలు లేచాయి. దీంతో స్థానికులు పరుగులు పెట్టారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే తన వాహనంలో వెళ్లిపోయారు.