గుంటూరు : రాజధాని గ్రామాలు కొన్ని చీకట్లో మగ్గుతున్నాయి. విద్యుత్ బకాయిలు చెల్లించాలని 12 గ్రామాలకు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. రెండు గ్రామాలకు ఇప్పటికే కరెంట్ బంద్ చేశారు. వీధి లైట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రాజధాని గ్రామాల వాసులు బయటికి రావడానికి ఇబ్బందిగా ఉంది. రాజధాని పరిధిలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కరెంటు బిల్లులు చెల్లించలేక ఈ దుస్థితి ఏర్పడింది.