రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. ప్రస్తుతానికి బాగానే కోలుకుంటున్నాడని చెప్పారు. వెంటిలేటర్ పై ఉన్నా ఎలాంటి ప్రాణాపాయం లేదని వివరించారు.
అయితే.. 48 గంటల వరకు అబ్జర్వేషన్ లో ఉంచుతామని చెప్పిన డాక్టర్లు.. బైక్ మీద నుంచి పడ్డాడు కాబట్టి అన్నీ తడవుగా చెక్ చేయడానికి అంత సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని భుజం దగ్గర ఎముక దెబ్బతిందని తెలిపారు.