ఐఫోన్ 11 ఇదిగో - Tolivelugu

ఐఫోన్ 11 ఇదిగో

ప్రపంచం ఎదురుచూస్తున్న ఐ ఫోన్ 11 ఆవిష్కరణ ఉత్సాహభరిత వాతావరణంలో యాపిల్ పార్కులో జరిగింది. తక్కువ వెలుగులోనూ స్పష్టంగా చిత్రాలు తీయగలిగే మెషిన్ లెర్నింగ్ సాంకేతికత ఐ ఫోన్ 11 ప్రో, ప్రో మాక్స్‌లో అమర్చారు.

స్మార్ట్ ఐ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఐ ఫోన్ 11, ఐ ఫోన్ 11 ప్రో, 11 ప్రో మాక్స్‌లను కాలిఫోర్నియా సంస్థ ప్రధాన కార్యాలయంలో స్టీవ్ జాబ్స్ ధియేటర్‌లో ఆవిష్కరించారు. ఈనెల 13 నుంచి ఐ ఫోన్ల బుకింగ్ మొదలవుతుంది. 20 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తామని యాపిల్ సంస్థ ముఖ్య కార్యనిర్వణాధికారి టీమ్ కుక్ వెల్లడించారు.

ఐ ఫోన్ 11- 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా తెరతో బ్లాక్, ఎల్లో, గ్రీన్, పర్పుల్, వైట్, రెడ్ రంగుల్లో ఉంది. వెనుక 2 కెమెరాలు, డాల్బీ అట్మో స్ శబ్దం, స్లోమోషన్ సేల్ఫీస్, వేగవంతమైన ఏ 13 బాయోనిక్ సీపేయు, జీపీయు, ఐ 10 ఆర్ కంటే గంట అదనంగా పనిచేసే బ్యాటరీ దీని ప్రత్యేకత.

ఐ ఫోన్ 11 ప్రో – 5.8 అంగుళాల సూపర్ రెటీనా తెర, మిద్ నైట్ గ్రీన్, స్పేస్ గ్రే, సిల్వర్, వైట్, గోల్డ్ రంగులు. వెనుక single pea glad, స్టెయిన్‌లెస్ స్టీల్, వెనుక 3 కెమెరాలు, డాల్బీ అట్మోస్ శబ్దం, సెకనుకు లక్ష కోట్ల ఆపరేషన్ జరిపే సీపీయు, 40 శాతం తక్కువ విద్యుత్, ఐ ఫోన్ 10 కంటే 4 గంటలు బ్యాటరీ పవర్ అదనం.

ఐ ఫోన్ 11 ప్రో max- 6.5 అంగుళాల తెర, ఐ ఫోన్ 10 మాక్స్ కంటే 5 గంటలు అదనంగా వచ్చే బ్యాటరీ, వెనుక 3 కెమెరాలు, ఒకేసారి 3 విభిన్న ఫోటోలు తీసే సౌకర్యం, కనురెప్పల మధ్య చోటు చూపే సామర్ధ్యం దీని సొంతం.

ధరలు ఇలావున్నాయ్. ఐ ఫోన్ 11- 64 జీబి 699 డాలర్లు, ఐ ఫోన్ 11 ప్రో – 128 జిబి 999 డాలర్లు, ఐ ఫోన్ 11 ప్రో మాక్స్ -128 జిబీ 1099 డాలర్లు.

Share on facebook
Share on twitter
Share on whatsapp