చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచాన్నే మరచిపోతాం. మార్కెట్లో న్యూ మోడల్ రాగానే అన్నీ పక్కన పెట్టి దాన్ని కొనాలనుకుంటాం. అదీ మొబైల్ ఫోన్లపై మనకున్న పిచ్చ. ఇందులో యూత్ పర్సంటేజ్ మరీ ఎక్కువ.
ఇక యాపిల్ ఫోన్ కొత్తది వస్తోందంటే బోలెడంత క్రేజ్..! ఇప్పుడు అంత లేదు కానీ.. అప్పట్లో అయితే దీనిపై మన ఛానళ్లలో స్పెషల్ బులెటన్లే ఇచ్చేవారు. ఇప్పుడు మార్కెట్లో వున్న ఐ ఫోన్ ఎక్స్ ఎస్ -512 జీబీ ఖరీదు రూ.1.5 లక్షలు, ఐ ఫోన్ -7 బ్లాక్ 128 జీబీ రూ.46 వేలు, ఐ ఫోన్ ఎక్స్ ఎస్ 256 జీబీ రూ.1.15 లక్షలు, ఐ ఫోన్ ఎక్స్ స్పా 64 జీబీ రూ.66 వేలు, ఐ ఫోన్ 8 ప్లస్ 256 జీబీ రూ.85 వేలు. ఎంత ధర ఉన్నా.. ఐఫోన్ ఐఫోనే.. దానికి సాటి వచ్చే ఫోన్ మరొకటి లేదని అభిమానులు బల్లగుద్ది మరీ చెబుతారు. ఆ క్రేజ్… ఆ ఫీచర్స్ బట్టే దాని ధరలు స్కైలోనే ఉండిపోయాయి. ఐఫోన్ మార్కెట్లో కొత్త వెర్షన్ వచ్చిందంటే ఇప్పటికీ విదేశాల్లో యాపిల్ ప్రియులు క్యూ కడతారు. వాటిని సొంతం చేసుకునేందుకు నైటంతా నిద్రలేకుండా అలా క్యూలోనే నిలుచున్న వైనాలు ఇప్పటికి ఎన్నో చూశాం.
తాజాగా మళ్లీ ఓ కొత్త ఐఫోన్ మోడల్ వస్తోంది. యాపిల్ ఫోన్ లేటెస్ట్ మోడల్స్ సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో మార్కెట్లోకి రాబోతున్నాయి. కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో న్యూమోడల్స్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అయింది.
ఐ ఫోన్ 10 ఎస్, ఐ ఫోన్ 10 ఎస్ మాక్స్, ఐ ఫోన్ ఎక్స్ ఆర్‌లకు కొనసాగింపు మోడల్స్ రానున్నాయి. ఐ ఫోన్ 11 సిరీస్‌లో మూడు మోడళ్ళు రానున్నాయి. ఐ ఫోన్ 11 సిరీస్‌లో ఎ14 బయోనిక్ చిప్ ప్రత్యేకత…! దీనిలో మెషిన్ లెర్నింగ్ సామర్ధ్యం ఉందని తెలుస్తోంది. ఐ ఫోన్ 11 , ఐ ఫోన్ 11 ప్రో, ఐ ఫోన్ 11 ప్రో మాక్స్ మోడళ్ళు ఆకర్షణీయంగా తయారుచేసి ఫోన్ ప్రియులకు అందించే ఏర్పాట్లు జరిగాయి. మరి ఇవి ఇండియాకు రావాలంటే కొంత సమయం పట్టవచ్చు..! అప్పటిదాకా ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే..!