ఏపీలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎస్‌ఈసీ కనకరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు.
గతంలో కరోనా కారణంగా అప్పటి ఎస్‌ఈసీ రమేష్‌కుమార్.. స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు. ఏప్రిల్ 31తో ఎన్నికల వాయిదా గడువు ముగిసింది. దీంతో ఎస్‌ఈసీ కనగరాజ్ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేశారు.
అదే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం దుమారం రేపుతోంది. రాజ్యాంగ విరుద్ధ నిర్ణయమని అడ్వకేట్ జంధ్యాల రవి శంకర్ వాదించారు.కోర్ట్ తీర్పు, కరోనా ప్రభావం తగ్గే వరకు ఏపిలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపించట్లేదు. అతి త్వరలో ఎన్నికలు నిర్వహించాలని దూకుడు మీదున్న ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించడం అంతా ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు.