ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఉత్తర-ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొదలుకావటంతో ప్రతి అంశాన్ని ఎస్ఈసీ లేఖ ద్వారానే ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ మరోసారి సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీల ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. ఏకగ్రీవాలు జరిగిన చోట ఎంపీడీవోలను బదిలీ చేయాలని లేఖ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 30 మంది ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఎస్‌ఈసీ ప్రభుత్వానికి సూచించింది.