రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, ప్రభుత్వ పెద్దల మధ్య ఉన్న పంచాయితీ కొనసాగుతూనే ఉంది. అయితే, నిమ్మగడ్డ కడపలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు కడపలో పర్యటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి ఆశీస్సులతోనో తాను కమిషనర్ ను కాలేదని, రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో వైఎస్సార్ హాయంలో అధికారులకు ఎంతో స్వేచ్ఛ ఉండేదని, నిజాన్ని నిర్భయంగా తనకు చెప్పే స్వేచ్ఛ అప్పట్లో ఉండేదని నిమ్మగడ్డ కామెంట్ చేశారు. ఎన్నికల్లో పోటీతత్వం ఉండాలని… కానీ ఒత్తిళ్లు మంచివి కావన్నారు. తాను ఏకగ్రీవాలను వద్దని చెప్పటం లేదని.. ఒత్తిళ్లతో జరిగే ఏకగ్రీవాలపై నిఘా ఉంటుందని హెచ్చరించారు.
జగన్ సొంత జిల్లాలో.. ఓవైపు వైఎస్ ను పొగుడతూ, మరోవైపు పరోక్షంగా జగన్ తీరును తప్పుపట్టడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.