మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సాయంత్రం 5గంటల్లోపు మీ ప్రతినిధి ద్వారా కానీ స్వయంగా వచ్చి మీరు ఎన్నికల సంఘంపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఆదేశించింది. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాలపై మంత్రి కొడాలి నాని స్పందించిన తీరుపై ఎస్ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు, ఫుటేజీతో సహా సేకరించినట్లు తెలుస్తోంది.
ఈ డోర్ డెలివరీ వాహనాలపై వాడిన కలర్లు, సీఎం జగన్ బొమ్మను తొలగించాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది.