ఏపీ పంచాయితీశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లపై చర్యలకు ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ డీవోపిటీకి లేఖ రాశారు. వారిపై అభిశంసన అభియోగాలు మోపాలని చెప్పారు. అంతేకాదు ఆ ఇద్దరిని నిర్భంద పదవీ విరమణ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో పాటు ఉద్దేశపూర్వకంగా ఓటరు జాబితాను ప్రచురించలేదని… ఈ ఇద్దరు అధికారులు భారత ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించారని ఎస్ఈసీ నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు. వీరి చర్యలు క్షమించరానివని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
మరో మూడు సంవత్సరాల పదవీకాలం ఉన్న ద్వివేదితో పాటు ఎంతో సర్వీసు ఉన్న గిరిజా శంకర్ లపై ఈ లేఖలు ఎక్కడకు దారితీస్తాయోనని అంతా భావించారు. అయితే, తాజాగా నిర్భంద పదవీ విరమణ అంశాన్ని పరిగణలోకి తీసుకోరాదని… వారి పనితీరు మారిన నేపథ్యంలో నిర్భంద పదవీ విరమణ సిఫార్సును వెనక్కి తీసుకుంటున్నట్లు లేఖ రాశారు. అయితే, అభిశంసన సిఫార్సులు మాత్రం ఇంకా యాధావిధిగానే ఉన్నాయి.