ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు క్లాజ్-1, క్లాజ్-4 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
మంత్రి కొడాలి నాని శుక్రవారం తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో నిమ్మగడ్డ, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఎస్ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేయగా, మంత్రి వివరణ పంపించారు. అయితే, మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని ఎస్ఈసీ కేసు నమోదు చేయాలని ఆదేశించింది.