కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో విద్యుత్ వినియోగానికి సంబంధించి వచ్చిన బిల్లునే ఏప్రిల్ బిల్లుకూ వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు పంపనున్నట్లు చెప్పింది. ఈనెల 18 వరకు అపరాధ రుసుము లేకుండా చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ ప్రకటించింది. ఈ మార్పును ఎనిమిది జిల్లాల ప్రజలు గమనించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు తెలిపారు.