• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » ఆ డ్రైవర్‌ ని ఉద్యోగం నుంచి తొలగించారా? ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ

ఆ డ్రైవర్‌ ని ఉద్యోగం నుంచి తొలగించారా? ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ

Last Updated: February 8, 2023 at 12:54 pm

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా లోకేష్‌ వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ కి ఓ ఏపీఎస్ ఆర్టీసీ బస్ డ్రైవర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. తన ఫోన్ కు ఉన్న చంద్రబాబు కవర్ ను అందరికీ చూపించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

లోకేశ్ కు షేక్ హ్యాండిచ్చిన డ్రైవర్ కు ఉద్వాసన అంటూ ప్రచారం.. ఖండించిన ఏపీఎస్ ఆర్టీసీ!

అయితే ఆ ఆర్టీసీ బస్ డ్రైవర్ తనకు షేక్ హ్యాండ్ చేశారని, జగన్ సర్కార్ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారని లోకేష్ ఆరోపించడం కలకలం రేపింది. తనకు మద్దతు తెలిపినందుకు డ్రైవర్‌ ను విధుల నుంచి తొలగించారంటూ ప్రభుత్వంపై లోకేష్ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ డ్రైవర్ తన అభిమానాన్ని మాత్రమే చాటుకుంటున్నారని.. ఆయన ఏం నేరం చేశారని ప్రశ్నించారు.

ఆర్టీసీ డ్రైవర్ టీడీపీ, లోకేష్ పట్ల అభిమానాన్ని చూపించారని ఉద్యోగం నుంచి తొలగిస్తారా..? అలాగైతే పోలీస్ స్టేషన్లలో వైసీపీ నేతలతో కేకులు కట్ చేయించిన వాళ్ళ సంగతి ఏంటి? తమ శాడిజానికి ఒక కుటుంబాన్ని రోడ్డుపాలు చేస్తారా? అంటూ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కొంతమంది ఇది నిజమా? లేక ప్రచారమా? అనే విషయాన్ని ఆర్టీసీ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై ఏపీఎస్ ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్ అంటూ ఖండించింది. ‘ఇదంతా తప్పుడు ప్రచారం.. డ్రైవర్ ‌ను ఉద్యోగం నుంచి తొలిగించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వాదనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారానికి బాధ్యులైన సోషల్ మీడియా నిర్వాహకులపై APSRTC తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది’. అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.

#FakeNewsAlert

This is absolutely false News. We strongly deny these claims made in media.

APSRTC will initiate suitable legal action on the responsible social media administrators for such fake propaganda https://t.co/g5HveEE2R0

— APSRTC (@apsrtc) February 8, 2023

Primary Sidebar

తాజా వార్తలు

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

ఇక నుంచి వ్యాపారం చేయాలంటే..ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్‌ తప్పనిసరి!

రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల తవ్వకాలు!

త్వరలోనే టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయాలు..పరీక్షలు ఎప్పుడంటే!

మక్కా వెళ్తుండగా ప్రమాదం..20 మంది మృతి!

అమెరికా పాఠశాలలో కాల్పులు..ఆరుగురి మృతి!

రాహుల్ పై..! ఉసేన్ బోల్ట్ ఆశ్చర్యపోయేలా..!?

‘డార్లింగ్’ అంటే తప్పా? కాంగ్రెస్ నేత సమర్ధన

కిడ్నీ వ్యాధితో మృతి చెందిన చిరుత..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా…!?

ఫిల్మ్ నగర్

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా...!?

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా…!?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు...చెప్పండి !?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు…చెప్పండి !?

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ ...!

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ …!

కొత్త ఫొటో షూట్ తో పిచ్చెక్కించేసిన నిహారిక

కొత్త ఫొటో షూట్ తో పిచ్చెక్కించేసిన నిహారిక

ఫ్లైట్ లో విష్ణుతో కలిసి మోహన్ బాబు.. మరి మనోజ్ ఎక్కడ?

ఫ్లైట్ లో విష్ణుతో కలిసి మోహన్ బాబు.. మరి మనోజ్ ఎక్కడ?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap