బస్సుల రంగుల విషయంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సులకు రంగులు మార్చాలని నిర్ణయించిన ఈ సంస్థ పసుపు రంగును తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాలలోని పెల్లె వెలుగు బస్సులకు రంగులు మార్చాలని ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును తొలగించి.. దానికి బదులు గచ్చకాయ రంగును వేయనున్నారు. రంగులతో పాటు.. డిజైన్ కూడా మార్చనున్నారు.