తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కు తెలంగాణ మిగతా ఉద్యోగ సంఘాలు ఇప్పటి వరకు మద్దతు ప్రకటించలేదు. మమ్మల్ని అడిగి సమ్మె చేస్తున్నారా అంటూ వితండవాదం చేస్తున్నారు. తోటి తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుంటున్న టిజిఓ నేతలకు మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు. అదే ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులనుంచి మాత్రం మద్దతు లభించింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం వ్యవహార శైలిని తప్పుబడుతూ అక్కడి కార్మికులు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం అయ్యారు. ఉద్యోగులు ఎక్కడ అధైర్యపడొద్దని మీకు తోడుగా మేము ఉంటాం అని ప్రకటించారు. పక్క రాష్ట్ర ఉద్యోగులకు ఉన్న బాధ్యత కూడా తెలంగాణ టిజిఓ నేతలకు లేదన్న విమర్శలు వస్తున్నాయి.