ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ డిపోల వద్ద నేటి నుండి కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టనున్నాయి. జిల్లాలోని ప్రజా రవాణా సంస్థలో టైపిస్టులు, డేటా ఆపరేటర్లు, గ్యారేజీ అటెండర్లు, విచారణ కేంద్రాల అసిస్టెంట్లు, స్వీపర్లుగా ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న 200 మంది సిబ్బందిని విధులకు హాజరు కావొద్దంటూ ఆయా డిపోల డీఎంలు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌ను సాకుగా చూపి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతున్నారని… ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతో కార్మిక సంఘాల మద్దతుతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు.