గుంటూరు : ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చాలని ఈ అంశంపై ఏర్పాటుచేసిన కమిటీ నిర్ణయించింది. దీనికి సీయం జగన్ ఆమోదం తెలిపారని రవాణా శాఖా మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఉద్యోగ భద్రత లేకుండా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల కల ఇన్నాళ్లకు నెరవేరబోతోందని అన్నారు. దీనిపై మంత్రిమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఆర్టీసి ఉద్యోగుల్ని ప్రభుత్వోద్యోగులుగా తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం ఆర్టీసీపై దాదాపు రూ. 3వేల నుంచి 3500 కోట్ల భారం పడుతుందని మంత్రి చెప్పారు. ఆంజనేయరెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి అధ్యయన నివేదిక సమర్పించినట్టు మంత్రి తెలిపారు.