సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలనుకుంటున్న వారికి ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ నుండి తెలంగాణకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. జనవరి 8 నుండి 13వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణకు 1,251 బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ పేర్కొంది. అలాగే ఇతరు రాష్ట్రాలకు కూడా స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. బెంగళూరు నుంచి 433, చెన్నై నుంచి 133 బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది.