ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ5 చానళ్లని ఎంఎస్ఓల్ని భయపెట్టి నిలిపివేయించడం ప్రజాస్వామ్యానికి ప్రతిబంధకమని జర్నలిస్టు సంఘాల నేతలు దుయ్యబట్టారు.
గుంటూరు: ఏపీయూడబ్లుజే, ఐజేయూ నేతలు విజయవాడలో అత్యవసర సమావేశం జరిపారు. ఐదు రోజుల క్రితం ఏపీ ఫైబర్‌లో ఛానెల్స్ నిలిపివేశారని, తాజాగా అన్ని చోట్లా నిలిపివేయాలని ఎంఎస్ఓలపై ప్రభుత్వం తీవ్ర వత్తిడి తెచ్చిందని నేతలు ఆరోపించారు. సోమవారంలోపు ఈ రెండు చానెల్స్ పున:ప్రారంభం చేయాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏపీయూడబ్లుజే రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు, చందు జనార్దన్, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, సోమసుందరం, ఆలపాటి సురేశ్, రాష్ట్ర కౌన్సిల్ నేత రాంబాబు, గుంటూరు జిల్లా కార్యదర్శి యేచురి శివ సమావేశంలో పాల్గొన్నారు.