ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కుటుంబంలో విషాదం నెలకొంది. రెహమాన్ తల్లి కరీమా బేగం తుది శ్వాస విడిచారు. తన తల్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రెహమాన్ తన తల్లి మృతి చెందిన విషయాన్ని తెలిపారు. అయితే అనారోగ్యం కారణంగా ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.
చాలా కాలం కింద రెహమాన్ తండ్రి సంగీత దర్శకుడు ఆర్ కే శేఖర్ కూడా మృతి చెందారు. ఆ తరువాత తల్లితో కలిసి రెహమాన్ ఇస్లాం మతం స్వీకరించి పేర్లు కూడా మార్చుకున్నారు. రెహమాన్ ను ఇస్లాం మతంలో చేరకముందు దిలీప్ గా పిలిచేవారు. ఇక తన తల్లితో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికప్పుడు రెహ్మాన్ అభిమానులతో పంచుకునేవాడు. తన కెరీర్లో తన తల్లి నిర్ణయాలు, సూచనలు కూడా ఉన్నాయని చెబుతుండేవారు.