మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ఇన్నాళ్లు తనదైన మేజికల్ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన ఆయన.. ఇప్పుడు యాక్టర్ గా అలరించేందుకు సిద్ధమయ్యారు. త్వరలో కోలివుడ్ స్క్రీన్ పై రెహమాన్ మెరవబోతున్నారు.
మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఆరట్టు మూవీలో గెస్ట్ రోల్ చేశాడు రెహమాన్. ఇందుకు సంబంధించిన లొకేషన్ ఫోటోను మోహన్ లాల్ షేర్ చేయడంతో ఈ విషయం తెలిసింది. ‘మ్యూజిక్ మ్యాస్ట్రో రెహమాన్ తో షూట్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది’’ అంటూ మోహన్ లాల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది.