భారతీయ సంగీతాన్ని ఎంతో మంది ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్లిన వారు ఉన్నారు… కానీ ప్రతి వెస్ట్రన్ ఆడియన్స్ కి మన సంగీతాన్ని రీచ్ అయ్యేలా చేసింది మాత్రం ఏఆర్ రెహమానే. ఇండియాన్ మ్యూజిక్ సూపర్ స్టార్ గా కాంప్లిమెంట్స్ అందుకుంటున్న రెహమాన్ గత 30 ఏళ్లుగా తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలని ఇచ్చాడు.
డిఫరెంట్ సౌండ్ మిక్సింగ్ కి కేరాఫ్ అడ్రస్ అయిన రెహమాన్ ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నాడు అంటేనే దాన్ని ఎప్పుడెప్పుడు వింటామా అని సంగీత ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆస్కార్ అవార్డ్ ని కూడా గెలుచుకుని వెస్ట్రన్ గడ్డ పై ఇండియన్ ఫ్లాగ్ ని ఎగరేసిన రెహమాన్, ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని చోట్లా మ్యూజిక్ కాన్సర్ట్ లు పెడుతూ ఉంటాడు. లక్షల మంది రెహమాన్ లైవ్ పెర్ఫామెన్స్ చూడటానికి వస్తుంటారు.
ఎన్నో దేశాల్లో ఈవెంట్స్ చేసినా రెహమాన్ చెన్నైలో మాత్రం ఈవెంట్స్ చెయట్లేదు. మ్యూజికల్ వరల్డ్ టూర్ లో బిజీగా ఉన్న రెహమాన్ ని ఒక అభిమాని, చెన్నై అనే ఒక ఊరు ఉంది మర్చిపోయారా? అని అడగగా… దీనికి సమాధానంగా రెహమాన్ ఆరు నెలలు పడుతుంది చెన్నైలో ఓ షో చేయడానికి పర్మిషన్ ప్రాసెస్ ”అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ కారణంగానే రెహమాన్ చెన్నైలో కాన్సర్ట్ చెయ్యడానికి రెడీగా లేడు. ఆరు నెలలు కేవలం పర్మిషన్స్ కోసమే టైం స్పెండ్ చెయ్యడం అనేది చిన్న విషయం కాదు. రెహమాన్ ఇచ్చిన సమాధానాన్ని బెస్ చేసుకుని ” ఆరు నెలల ప్రాసెసింగ్ టైం ఏంటి? ఇదేమి గవర్నమెంట్ ” అంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కొందరు విమర్శిస్తున్నారు. మరి గవర్నమెంట్ పై వచ్చే విమర్శలకు ఇన్ డైరెక్ట్ గా కారణం అయిన రెహమాన్ ఈ విషయం పై ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.