aravinముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగనుంది. బుధవారం ఉదయం కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి ఈ విషయం తెలియజేశారు. దాదాపు 15 నిమిషాలు లెఫ్టినెంట్ గవర్నర్ తో కేజ్రీవాల్ మాట్లాడారు.
ఈరోజు(బుధవారం) కేజ్రీవాల్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే కేజ్రీవాల్ ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రభత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రమాణ స్వీకారానికి ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ లెఫ్టి నెంట్ గవర్నర్ కు లేఖను అందజేస్తారు. అనంతరం కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఢిల్లీలోని మొత్తం 70 నియోజకవర్గాలకు గాను 62 స్థానాల్లో ఆప్ విజయం సాధించింది. బీజేపీ 8 స్థానాలను గెల్చుకుంది. అయినప్పటికీ 2015 ఎన్నికలతో పోల్చితే పార్టీ కొంత మెరుగైన ఫలితాలనే కనబర్చింది. 2015 లో కేవలం 3 సీట్లకే పరిమితమైంది. 15 సంవత్సరాలు ఢిల్లీని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఖాతానే తెరవలేదు.