నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కస్టడీ’. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.
ఇటీవల విడుదలైన చిన్న గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కృతి శెట్టి పాత్రతో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ క్యురియాసిటీని పెంచింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాలో విలన్ ను పరిచయం చేశారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో రాజు అనే మాస్ పాత్ర పోషిస్తున్నాడు. ఆ లుక్ రిలీజైంది.
అతని లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. సంకెళ్లతో బార్స్ వెనుక కనిపిస్తున్నాడు. తాజా లుక్ తో ఈ సినిమా పక్కా యాక్షన్ మూవీ అనే విషయం తేలిపోయింది.
ఈ చిత్రంలో ప్రియమణి ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండగా.. శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది కస్టడీ.