రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వక ముందే నాగ అశ్విన్ డైరెక్షన్లో ఓ పాన్ మూవీ ని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం నాగ అశ్విన్ ప్రభాస్ కోసం అనుకున్న కథను పూర్తి చేసాడట. రాదా కృష్ణ మూవీ పూర్తి కాగానే దీనిని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారట.
ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. కాగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల కానుంది. అందుకే నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం స్టార్స్ ను వెతికే పనిలో పడ్డాడట. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి నటించబోతున్నారని సమాచారం. ఇప్పటికే అరవింద్ స్వామి రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధ్రువ సినిమాలో విలన్ గా నటించి అందరికి మెప్పించిన సంగతి తెలిసిందే.