తిరుపతిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు స్థానికులు. రామానుజ సర్కిల్ లోని టీటీడీ ఆర్చి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలు కాగా.. రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.
నగరంలోని రిలయన్స్ మార్ట్ దగ్గర ఉన్న ఈ స్వాగత తోరనానికి లారీ తగిలినట్లు చెబుతున్నారు. గరుడ వారధి నిర్మాణ పనుల సమయంలోనే ఇది పాక్షికంగా దెబ్బతింది. ఇప్పుడు లారీ ఢీకొట్టడంతో పడిపోయిందని భావిస్తున్నారు. విషయం తెలిసిన అధికారులు పడిపోయిన ఆర్చిని తొలగించారు.