ఎడారి ప్రాంతం అనగానే మన కళ్ళ ముందు కనపడే జంతువు ఒంటె. ఒంటెల విషయంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. అవి ఎడారి ప్రాంతాల్లో ఉండటంతో అక్కడ సరుకుల రవాణా కోసం గాను వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటి పాదాల క్రింది భాగాలు పెద్దగా ఉండటంతో అది ఇసుకలో వేగంగా నడిచినా సరే పాదం ఇసుకలో దిగబడదు. ఎడారులలో ఎక్కువ దూరము ప్రయాణించినా సరే వీటికి ఆయాసం అనేది ఉండదు.
తమ కడుపులో ఎక్కువ నీళ్ళను నిల్వ చేసుకుని కొన్ని రోజుల పాటు నీళ్ళు లేకుండా ఉంటాయి. ఒంటెలు నీళ్లు తాగకుండా రెండు నెలల వరకూ ఉంటాయట. అలాగే అవి నీళ్ళు దొరికితే మాత్రం ఒక్కసారే ఏడు నుంచి 40 లీటర్ల నీళ్ళ వరకు తాగుతాయి. ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటితే తప్పించి వాటికి చెమట పట్టడం ఉండదు. ఒంటెలు తమ కడుపులో ఉండే సంచిలో నీటిని నిల్వ చేసుకోవడంతో అవి వేడి తట్టుకుని నిలబడతాయని అంటారు.
కాని ఒంటె మూపురంలో అత్యధిక మోతాదులో కొవ్వు ఉండటం దానికి బాగా కలిసి వచ్చే అంశం. ఇది బయటి వేడిని శరీరంలోకి రాకుండా అడ్డుకుని ఒంటెకు హెల్ప్ చేస్తుంది. ఇక ఒంటెను వేటాడటం ఏ మృగానికైనా కష్టమైన వ్యవహారమే. ఒంటె కాళ్లు చాలా బలంగా ఉండటమే కాకుండా ఒంటె కాలుతో తంతే ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదు. ఇక ఇసుక తుఫాన్ల సమయంలో కూడా ఒంటెలు స్పష్టంగా చూడటమే కాకుండా అవి భయపడి ఎక్కడికి వెళ్ళకుండా ఉంటాయి. ఇక తన మీద ఎవరైనా దాడి చేస్తే అది ఉమ్మితే ఆ వాసన తట్టుకోవడం చాలా కష్టం. ఆకుపచ్చ రంగులో ఉండే చిక్కటి ద్రవాన్ని ఊస్తాయి. ఆ జిగురు వదిలించుకోవడం ఒక నరకం అయితే ఆ స్మెల్ భరించడం మరో నరకం.