ఈ రోజుల్లో ఆహారం విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా బయట మార్కెట్ లో దొరికే ప్రతీ వస్తువు మీద అనుమానాలు ఉన్నాయి. ఏది ఎలా తింటే మంచిది అనేది అందరిలో ఉన్న సందేహం. ఇక కోడి గుడ్డు విషయానికి వస్తే దాన్ని ఏ విధంగా తినాలో ఒకసారి చూద్దాం.
Also Read:ఇంటి పక్కన చింత చెట్టు ఎందుకు ఉండకూడదు…?
పచ్చిగుడ్లు ఈ మధ్య కాలంలో కొందరు ఎక్కువగా తింటున్నారు. బాడి బిల్డింగ్ విషయంలో దృష్టి పెట్టిన వాళ్ళు దీని మీద ఫోకస్ చేస్తున్నారు. అలా తీసుకోవడం వలన ఎక్కువ పోషకాలు వస్తాయి అని నిపుణులు చెపుతున్నారని ఇంకా ఎక్కువ తింటున్నారు. ఈ పచ్చి గుడ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదనే మాట బలంగా వినపడుతుంది. ఇలా తింటే హృదయానికి సంబందించిన జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పచ్చి గుడ్ల లో ఎక్కువ బాక్టీరియా ఉంటుంది.
ఇక ఉడికించిన గుడ్లు విషయానికి వస్తే… మన నిత్య జీవితం లో ఎక్కువ మంది ఉడికించిన గుడ్లునే తింటారు. ఉడికించిన గుడ్లులో కూడా బాగా పోషకాలు ఉండటంతో వైద్య నిపుణులు సైతం అవే తినాలని చెప్తున్నారు. రోజు రెండు గుడ్లు కనీసం తినాలి. అలాగే ఉడికించిన గుడ్లును నిమ్ము ఉన్న వాళ్ళు తింటే కచ్చితంగా తగ్గుతుంది.
ఇక నూనెలో వేయించిన గుడ్లు ఎక్కువగా తినే వాళ్ళు ఉన్నారు. ఈ గుడ్లు మనం రుచి కోసం, కొంచెం కారం తినడం ఇష్ట పడేవాళ్ళు తింటారు. పైన రెండు రకాల తో పోలిస్తే దీనిలో కొంచం పోషకాలు తక్కువ. పచ్చి గుడ్లలో పోషకాలు చాలా ఎక్కువ నాటు కోడి గుడ్లు అయితే కచ్చితంగా తినవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో ఉడికించిన గుడ్డు తినడమే మంచిది.
Also Read:నోరు జారాను.. అది నా తప్పిదమే…!