దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పుడు మరోసారి పెరిగే అవకాశం ఉందనే వార్తల నేపధ్యంలో తమ బిడ్డల భవిష్యత్తు విషయంలో తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా అదుపులోకి వచ్చిందని భావించిన తరుణంలో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన కొత్త వేరియంట్ తో కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో ఒక సర్వే మాత్రం తల్లి తండ్రులు తమ బిడ్డల విషయంలో కంగారు పడటం లేదని స్పష్టం చేసింది.
ఈ సర్వే భారతదేశంలోని 332 జిల్లాల నుండి 10,000 కంటే ఎక్కువ మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది. వారిలో 61% మంది పురుషులు మరియు 39% మంది మహిళలు ఉన్నారు. స్ట్రెయిన్ కేసులు బయటపడిన సమయంలో మాత్రమే చాలా మంది తల్లి తండ్రులు స్కూల్స్ క్లోజ్ చేయాలని కోరారని కానీ ఇప్పుడు మాత్రం 25 కిలోమీటర్ల పరిధిలో కేసు వస్తేనే స్కూల్ క్లోజ్ చేయాలని కోరుతున్నారని సర్వే తెలిపింది.
12% మంది తల్లిదండ్రులు జిల్లాలో లేదా సమీప ప్రాంతాలలో ఒక్క ఓమిక్రాన్ కేసు వచ్చినా సరే పాఠశాలలను మూసివేయాలని చెప్పారని… మరోవైపు, 21% మంది తల్లిదండ్రులు జిల్లాలో లేదా సమీప ప్రాంతాలలో కేసు వచ్చినా సరే ట్రావెల్ హిస్టరీ లేని ఒక్క ఓమిక్రాన్ కేసు ఉన్నట్లయితే పాఠశాలల్లో ఆఫ్‌లైన్ క్లాసులను ఆపేయాలని కోరినట్టు సర్వే పేర్కొంది. 30% మంది తల్లిదండ్రులు తమ జిల్లా లేదా పరిసరాల్లో కోవిడ్-19 వేరియంట్ యొక్క నాన్-ట్రావెల్ సంబంధిత కేసు బయటపడే వరకు ఆగాలని విజ్ఞప్తి చేసారు.