వేసవి కాలం వస్తుంది అంటే చాలు పచ్చడి హడావుడి ఎక్కువగా ఉంటుంది. పండు మిర్చి, టమాటో, మామిడి కాయ ఇలా ఎన్నో పచ్చళ్ళు పడుతూ ఉంటారు. ఇక పచ్చడి పెట్టె ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం పచ్చడి ఎక్కువ రోజుల పాటు ఉండదు. ఇక పచ్చళ్ళు పెట్టినపుడు పాటించాల్చి న జాగ్రత్తలు ఒకసారి చూద్దాం. జాడీలు శుభ్రంగా కడగాల్సి ఉంటుంది.
పొడి బట్టతో తుడుచుకుని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత జాగ్రత్తగా పెట్టకోవాలి. మామిడి కాయలు కానీ, నిమ్మకాయలు కానీ ఎవైనా మంచి వి చూసిమామిడి కాయలు అయితే పుల్ల విగా ఉండాలి. ఇంటికి తెచ్చుకునికడుక్కుని తుడుచుకుని ముక్కలు ఎండలో పెట్టాలి. వాటి మీద ఉన్న తడి ఆరిపోతుంది. ఇక్కడ జాగ్రత్త గా గమనించాల్సిన విషయం ఉప్పు సరిపడా వేసుకోవాల్సి ఉంటుంది.
Advertisements
లేకపోతే బూజు వచ్చి పచ్చళ్ళు పాడయ్యే అవకాశం ఎక్కువ. నూనె విషయంలో జాగ్రత్తగా లేకపోతే పచ్చడి పట్టిన వారం లోపే పోతుంది. నూనె ఉప్పు కారం ‘ ఆవ పిండి ‘మెంతి పిండి అన్నీ సమ పాళ్ళలో ఉండాల్సి ఉంటుంది. అలా ఉంటే పచ్చళ్ళు సంవత్సరం పొడుగునా రుచిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఉప్పు తక్కువ అయితే పచ్చడి పాడయ్యే అవకాశం. నూనె కూడా తక్కువ కాకుండా పోసుకోవాలి. తడి చేతులు పెడితే పచ్చడి నాశనం.