ఇదివరకు ఆయా టీవీఛానెళ్ళలో వచ్చేఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ కి ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. సినిమాలు, పాటలు, గేమ్ షోలు, ఇంటర్వ్యూలతో స్లాట్సన్నీ నిండిపోయేవి. ప్రేక్షకులు కూడా టీవీలకు అతుక్కు పోయేవారు.
ఇప్పుడు పరిస్థితి మారింది. స్లిమ్ టీవీలొచ్చి గోడకు అతుక్కుపోయాయి గానీ..ప్రేక్షకులు అతుక్కుపోయే పరిస్థితిలేదు. ఎందుకంటే ఆఛాన్స్ సెల్ ఫోన్స్ కొట్టేసాయి.ఈ విషయం పక్కనబెడితే. ఇక ఇంటర్వ్యూస్ విషయానికి వస్తే వీటి ట్రెండ్ మారిందనే చెప్పాలి.
ఒకప్పుడు టీవీఛానెస్స్ లో మిగతా ప్రోగ్రామ్స్ తో పోలిస్తే ఇంటర్వ్యూస్ కి అంతక్రేజ్ ఉండేదికాదు. అవి కూడా ఆయా ఛానల్స్ కి సంబంధించిన ‘సినిమా రిపోర్టర్స్’ కంటిన్యుయెస్ గా వెంటపడి…సదరు సెలెబ్రిటీ చెవిలో ఇల్లుకట్టుకుంటే..దయతలచి. ఓ రొటీన్ క్వశ్చన్ల బోరింగ్ ఇంటర్వ్యూ ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
ప్రజెంట్ ఓటీటీల పుణ్యమా అని ఇంటర్వ్యూ చేసే పద్ధతే మారిపోయింది. దీనిని ఇప్పుడు టాక్ షో అంటున్నారు. వ్యాఖ్యాతలుగా టాప్ గ్రేడ్ సెలబ్రిటీలు.. వ్యవహరిస్తున్నారు. వచ్చే గెస్ట్స్ కూడా ఇంచుమించు అలాంటివాళ్ళే అయ్యుంటున్నారు..!?
అయితే ఈ టాక్ షోలకు డబ్బులిచ్చి మరీ సెలబ్రిటీలను తీసుకొస్తున్నారని టాకు. అయితే వీటిలో వర్గీకరణలు కూడా ఉన్నాయి. ప్రసార మాధ్యామాలనుబట్టి ఈ వర్గీకరణ ఉంటుంది. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, ఓటీటీ ఇంటర్వ్యూలుగా చెప్పొచ్చు.
ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చే ఇంటర్వ్యూస్ అయితే ఇంటర్వ్యూ చేసేవాళ్ళే కాదు, వచ్చేవాళ్ళు కూడా ఎవరికీ తెలియదు. కంటెంటు సైతం ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటుంది.ఓటీటీల్లో మాత్రం టాప్ రేంజ్ సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ టాక్ షోలను నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. అయితే వచ్చిన గెస్టులకు రెమ్యున్రేషన్ ఇస్తున్నారా ?! ఇస్తే ఎంత మొత్తంలో ఉంటాయి అనే విషయం గురించి పెద్ద ఎత్తున సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆహా ఓటీటీలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ‘ఆహా’కు ఎంతో క్రేజ్ రావడమే కాకుండా, సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఆమేరకు ఆదాయం కూడా పెరుగుతుందనడం నిర్వాదం. అంతే కాదు టాక్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు కూడా వారివారి రంగాల్లో మైలేజ్ పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.
ఇటీవల అన్ స్టాపబుల్ టాక్ షోకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వంటి సెలబ్రిటీలు ఈ టాక్ షోకి రావడం ద్వారా ఇటు వీరికి, అటు ఛానెల్ కీ ఉపయుక్తంగా ఉంటుందనడంలో డౌట్ లేదు. అయితే ఈ తరహా సెలబ్రిటీలకు రెమ్యున్రేషన్లు ఉండకపోవచ్చు.
ఓమోస్తరు సెలబ్రిటీలకు అయితే తప్పకుండా రెమ్యూనరేషన్ ఉంటుందని షో వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమాలకు తీసుకునేంత రెమ్యూనరేషన్ కాకపోయినా ఎంతోకొంత రెమ్యూనరేషన్ ముట్టజెప్తారని వినికిడి.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ కెరీర్ ఎందుకు ఆగిపోయింది…?