టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఇద్దరూ రాజమౌళి సినిమాలతో మంచి స్టార్ ఇమేజ్ పెంచుకున్నారు అనే చెప్పాలి. బాహుబలి సినిమాతో ప్రభాస్ కెరీర్ లో మర్చిపోలేని హిట్ కొట్టాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇద్దరికీ రాజమౌళి మంచి మిత్రుడు అనే సంగతి తెలిసిందే.
ఇక ఇద్దరూ ఇప్పుడు ఒకే దర్శకుడు సినిమాలు చేస్తున్నారు. సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ చేసిన రెండు సినిమాలు ఒకే కథతో వచ్చాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు.
ప్రభాస్ నటించిన రెబల్, జూనియర్ నటించిన రామయ్య వస్తావయ్య సినిమాలు ఒకే కథతో వచ్చాయి దాదాపుగా. రెబల్ సినిమాకు రాఘవా లారెన్స్, రామయ్య వస్తావయ్య సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ చనిపోగా, హీరోలు విలన్ మీద పగ తీర్చుకుంటారు. ఆ తర్వాత మరో అమ్మాయిని హీరోలు లవ్ చేస్తారు. విలన్ ఆ హీరోయిన్ కి తండ్రి. దాదాపుగా రెండు సినిమాలు ఒకే విధంగా ఉంటాయి. రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.