చాలా మంది పెరుగు తినడానికి గాని మజ్జిగ తాగడానికి గాని ఇష్టపడరు. వాళ్లకు పెరుగు తింటే చికాకుగాను ఇబ్బందిగాను ఉంటుంది కాబట్టి అలా చేయరు. అయితే మన ఆరోగ్యానికి పెరుగు అనేది చాలా ఉపయోగకరం అనే చెప్పాలి. ఇక పెరుగు గురించి అవగాహన లేక దాన్ని తినే ప్రయత్నం చేయరు కొందరు. శరీరానికి మేలు చేసే పదార్థాలలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. పెరుగు తినడంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట.
ఇందులో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. అదే విధంగా ఎముకలకు మేలు చేస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ ను అధిక రక్తపోటు క్రమంగా తగ్గిస్తుందని వైద్యులు చెప్తున్నారు. పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు కాకుండా, చర్మానికి జుట్టుకి కూడా మంచి మేలు చేస్తుంది. కానీ కొంతమందికి పెరుగు తీసుకోవడం చాలా హానికరం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
కొన్ని వ్యాధులు ఉన్నవారు పెరుగు తీసుకోవడం మానేయడం ఉత్తమం. అలాగే పెరుగు ప్రతిరోజు అవసరానికి మించి తీసుకుంటే అనేక సమస్యలు ఎదుర్కోవాలి అని హెచ్చరిస్తున్నారు. పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలకు దంతాలకు చాలా మేలు జరుగుతుంది. అయితే పెరుగు తీసుకోవడం కీళ్ల నొప్పులు ఉన్నవారికి మంచిది కాదు. ఆర్థరైటిస్ రోగులు పెరుగు తీసుకోవడం మానేయాలి బదులుగా క్రమంగా మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. పెరుగు తింటే మాత్రం నొప్పిని చాలా తీవ్రతరం చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు పెరుగు తినడం మంచిది కాదు. ఆస్తమా ఉన్న రోగులు పెరుగు తింటే ప్రాణాల మీదకు రావొచ్చు.