అలనాటి అగ్ర నటుడు కాంతారావు పిల్లలకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. ఆయన పిల్లలు ఇప్పుడు దీనావస్థలో ఉన్నారని, స్టార్ వారసులు అయినా సరే పూట గడవని పరిస్థితి ఉందనే చర్చ నడుస్తుంది. ఇక కాంతారావు కుమార్తె సుశీల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణ తన ఫేవరేట్ హీరో అని తెలిపారు. కృష్ణగారు, వాణిశ్రీ అన్నా కూడా చాలా ఇష్టమని తెలిపారు.
కృష్ణగారితో మాట్లాడాలంటే భయం ఉండేదన్నారు. కృష్ణగారు భోళా మనిషి అని కపటం లేని వ్యక్తి అని నాన్న చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఉన్న స్థాయిలో అభిమాన సంఘాలు ఎవరికీ లేరని వివరించారు. కృష్ణ మరణ వార్త తెలిసి ఏడుస్తూనే ఉన్నానన్నారు. సెట్స్ లో ఉన్న సమయంలో కూడా ఆయన చాలా సరదాగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. కృష్ణగారు అంటే ఎంత అభిమానమో చెప్పలేనని వివరించారు.
కృష్ణగారి ప్రతి మూవీలో నాన్నకు ఒక పాత్ర ఇచ్చేవారని చెప్పిన ఆమె పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. మా అమ్మను భలే ఆట పట్టించేవాళ్లమని బాగా వచ్చిన జవాబులే పదిసార్లు చెప్పేవాళ్లమని అన్నారు. నాన్న సంపాదించిన ఆస్తులను నాన్నే అమ్మేశారన్నారు. నాన్న 5 సినిమాలను నిర్మించారని ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు నష్టాలను మిగిల్చాయని చెప్పుకొచ్చారు. కృష్ణగారితో నాన్నగారు ప్రేమజీవులు అనే సినిమాను తీస్తే ఘోరమైన ఫ్లాప్ అయిందని, 450 ఎకరాల ఆస్తులు పోయాయని పేర్కొన్నారు.