స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం అంటే మన మైండ్ లలో రన్ అయ్యేది బ్యాటరి లైఫ్. బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్లోని విండ్ డౌన్ ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ కారణంగా మన బ్యాటరీకి ఏ విధమైన ఉపయోగం ఉంటుంది. విండ్ డౌన్ అనే ఈ ఫీచర్ కొంత సమయం తర్వాత ఎక్కువగా రాత్రి 10-11PM సమయాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
Also Read:అక్కడ ట్రెండ్ సెట్ చేసిన ఆర్ఆర్ఆర్.. కొత్త రికార్డులు నమోదు
ఫోన్ వాడకం తగ్గించడానికి గూగుల్ జోడించిన సాఫ్ట్‌వేర్ ఫీచర్ ఇది. ఆండ్రాయిడ్ 9 నుంచి ఇది అందుబాటులో ఉంది. విండ్ డౌన్ ఫీచర్ మొత్తం UI గ్రేస్కేల్ మోడ్‌కు సెట్ చేస్తుంది. అంటే బ్లాక్ అండ్ వైట్ కు సెట్ అవుతుంది. డిస్ప్లే అలాగే GPU ద్వారా తక్కువ విద్యుత్ వినియోగం కారణంగా ఏకకాలంలో శక్తి ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.
బ్యాటరీ సేవర్‌గానే కాకుండా రాత్రి సమయంలో స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి గాను విండ్ డౌన్ మోడ్‌ను గూగుల్ తీసుకొచ్చింది. కళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా. UI గ్రేస్కేల్ టోన్‌కు సెట్ చేస్తే ఫోన్ వాడాలనే కోరిక కూడా చచ్చిపోతుంది. రోజంతా దాన్ని ఎనేబుల్ చేస్తే మాత్రమే విండ్ డౌన్ తో బ్యాటరీ ఆదా అవుతుంది.
Also Read:యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు చేయొద్దు