ఆధార్ కార్డు లేనిదే ఈ రోజుల్లో ఏ పని జరగడం లేదు. ఆధార్ కార్డు విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే ఈ రోజుల్లో ఏ పనైనా జరగొచ్చు… మనం చిక్కుల్లో పడవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో ఆధార్ కార్డు ప్రతి చోట తప్పనిసరి చేయడంతో దాని వాడకం క్రమంగా పెరుగుతుంది. బ్యాంక్ అకౌంట్స్ ఐటి రిటర్న్ లకు పాన్ కార్డ్ ఎక్కడికి వెళ్లినా ఆధార్ తప్పక వెంట తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: ముర్ము ఘన విజయం.. ప్రధాని అభినందనలు
కాబట్టి ఈ రోజుల్లో మన ఆధార్ కార్డు ఎవరికి ఇస్తున్నామో, ఇచ్చే కారణం ఏంటో కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్లు ఆధార్ ని పంచి పెడితే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఆధార్ తీసుకున్న వ్యక్తులు దాన్ని ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడితే మనం చిక్కుల్లో పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దీనినే ఇంగ్లిష్ లో ఐడెంటిటి తెఫ్ట్ అంటారు.
అనగా మన గుర్తింపు వివరాలతో ఫ్రాడ్ చేయడం మనకు పెద్ద సమస్యలు తెస్తుంది. ఆధార్ సేవలను అందిస్తున్న UIDAI మన భద్రత కోసం ఆధార్ నెంబర్ యొక్క చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా ఆధార్ ను డౌన్లోడ్ చేసుకొనే సౌకర్యం ఇటీవల కల్పించింది. దీనిని మాస్కడ్ వెర్షన్ అని పిలుస్తారు. దీన్ని అన్ని చోట్లా వాడుకొనే అవకాశం కల్పించారు. ఇక కార్డు విషయంలో ఒక అంశాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఆధార్ కాపీ ని ఎవరికైనా ఇస్తే గనుక మన సంతకంతో పాటుగా ఇచ్చిన తేదీని అలాగే ఏ పర్పస్ కోసం ఇచ్చాం అనేది అక్కడ కచ్చితంగా రాయాల్సి ఉంటుంది.