ఒకే ఒక్క గ్రామం ఇప్పుడు ఇండియా మొత్తాన్ని భయపెడుతుంది. ఆ గ్రామం నుంచి జరుగుతున్న మోసాలకు ఎకౌంటు లో డబ్బులు ఉన్న వాళ్లకు కంటి మీద కునుకు లేదు. తూర్పు జార్ఖండ్‌లోని లోతట్టు ప్రాంతంలో ఉన్న జమ్తారా అనే చిన్న గ్రామం నుంచి సైబర్ నేరాలు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. కోల్‌కతాకు ఈశాన్యంగా 250 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి.
తాజాగా, కోల్‌కతా నగరంతో పాటుగా ఇండియా మొత్తం జమతారా గ్యాంగ్ మళ్లీ యాక్టివ్‌గా ఉందని, సైబర్ నిపుణుడు సందీప్ సేన్‌గుప్తా సంచలన విషయాలను బయటపెట్టారు. రోజూ చాలా మందికి వివిధ కంపెనీల నుంచి కాల్స్ వస్తున్నాయని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు. సైబర్ నిపుణుడు అయిన సందీప్ సేన్‌గుప్తాకు కూడా ఇటీవల అలాంటి కాల్ వచ్చింది.
బ్యాంక్ మేనేజర్లుగా లేదా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లుగా మాట్లాడుతూ వాళ్ళు కాల్స్ చేస్తారని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైన బ్యాంకు వివరాలు తీసుకుని… బ్యాంకు ఖాతాల్లోని డబ్బు మొత్తాన్ని కాజేస్తారు. ఈ ప్రాంతంలోని సైబర్ క్రిమినల్ ముఠాలు నకిలీ కేవైసి పత్రాలను ఉపయోగించి ఓపెన్ చేసిన సిమ్ కార్డ్‌లు, డిజిటల్ వాలెట్‌లు అలాగే బ్యాంక్ ఖాతాలను ఇన్సిడియస్ వెబ్ వాడి కాజేస్తున్నారు.
కేవైసి అప్‌డేట్ కోసం గానూ సేన్‌గుప్తాకు మొబైల్
Advertisements
సర్వీస్ ప్రొవైడర్ నుండి కాల్ రాగా… తనకు కాల్ చేసిన వ్యక్తి కేవైసి అప్‌డేట్ కోసం ప్లే స్టోర్‌కి వెళ్లి ‘టీమ్ వ్యూయర్ క్విక్ సపోర్ట్’ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని అడిగాడు. వెంటనే అనుమానం రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
దీన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి, పిన్ నంబర్‌ను షేర్ చేస్తే మోసగాళ్ల చేతిల్లోకి మీ ఫోన్ వెళ్ళినట్టే. బ్యాంక్ ఎకౌంటు నంబర్ అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సమాచారాన్ని మొత్తం అతనికి ఇచ్చినట్టే. అలాగే ఫోన్ నుండి వివిధ పాస్‌వర్డ్‌లు, ఫోటోలు-వీడియోలను కూడా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. మీరు గనుక ఆ ట్రాప్ లో పడ్డామని భావిస్తే వెంటనే మొబైల్ డేటాను ఆఫ్ చేయండి. అప్పుడు ఆన్లైన్ లింక్ ఆగిపోయి మోసాపోకుండా కాపాడుకోవచ్చు.