బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఇటీవల తన వెయిట్ తగ్గడంపై దృష్టిపెట్టాడు. బరువు తగ్గేందుకు గాను జిమ్ లో గంటలు తరబడి కష్టపడుతున్నాడు. ఇటీవల ఈ హీరో వెయిట్ తగ్గారు. తన బాడీలో వచ్చిన మార్పులు కనిపించేలా దిగిన ఫోటోలను తన ఇన్ స్టా హ్యాండిల్ లో షేర్ చేశారు. బరువు తగ్గక ముందు తగ్గిన తర్వాత అంటూ ఇన్ స్టాలో ఫోటోలను పెట్టాడు.
తాను అలా ఫిట్ గా మారడానికి 15 నెలల సమయం పట్టినట్టు అర్జున్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. అయితే అర్జున్ బరువు తగ్గడం ఇదేమి తొలిసారి కాదు. తన తొలి చిత్రం ఇషాక్‌జాదేనిలో నటించడానికి గాను 50 కిలోల బరువు తగ్గి వార్తల్లోకి ఎక్కారు.
ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ… ‘ 15 నెలలుగా కష్టపడుతున్నాను. నా పనిలో పురోగతి సాధించాను. నేను ఈ ప్రయాణం గురించి చాలా గర్వపడుతున్నాను. ఇది చాలా కష్టమైన పని. అయినప్పటికీ ట్రాక్ లో ఉండగలిగినందుకు సంతోషిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.
ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ హీరో ఫోటోలను ఆయన అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు అర్జున్ అంకుల్ సంజయ్ కపూర్, ఆంటీ మహదీప్ కపూర్ లు చప్పట్లు కొడుతున్న ఎమోజీని పెట్టారు. ఆయన చెల్లెలు అన్షులా కపూర్ యెస్ అంటూ కామెంట్స్ పెట్టారు.