బాలీవుడ్ బ్యూటీ మలైక, స్టార్ హీరో అర్జున్ కపూర్ల అఫైర్ మీద గతంలో చాలా వార్తలు చక్కెర్లు కొట్టాయ్. వాళ్ళది లివింగ్ రిలేషన్ మాత్రమే కాదు, త్వరలో వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకోబోతున్నారనే టాక్ టాప్ లేపింది. ఇదంతా కేవలం రూమరని ఇంతకు ముందే క్లారిటీ ఇచ్చేసింది మలైక.
అయితే రీసెంట్ గా మలైకా ప్రగ్నెంట్ అయ్యిందనే న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. విషయం వీధికెక్కడంతో తాజాగా కాసింత ఘాటుగా స్పందించింది.నెట్లో సర్కిలేట్ అవుతున్న ఆర్టికల్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ..ఇది చాలా సెన్సిటివ్ విషయం.ఇది ఎందాకా పోతుందో లెలీదు. ఇంత చెత్త న్యూస్ ఎలా రాస్తారు.
గతంలో కూడా ఇలాగే ఇష్టమొచ్చినట్టు రాసుకుంటూ పోయారని సీరియస్ అయ్యింది. అసలు మా పర్స్నల్ విషయాలను మీ ఇష్టానికి రాసేసే హక్కు మీకు ఎక్కడిదని మండి పడింది. నిజానికి అర్జున్,అరోరాలు మూడేళ్ళుగా రిలేషన్ లో ఉన్నారు. అంతే కాదు 2019 లో అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. అధికార ప్రకటన లేకపోయినా 2023 లో పెళ్ళిచేసుకోబోతున్నారనే వార్తలైతే అప్పట్లో గుప్పమన్నాయ్ .
ఇంతచేసి..ప్రెగ్నెంట్ విషయం వచ్చేసరికి ఉరుముతోంది. ప్రెగ్నెంట్ అనేమాట గాసిప్పే అయితే కనిపించేదంతా వట్టి గ్యాసేనా…!? ఇట్టా మండి పడితే ఎట్టా… ఏదోటి ఒప్పుకోవాలిగా మలైకా?! అంటూ నెటిజన్లు నివ్వెరపోతూ అడిగే ప్రశ్న!?