అర్జున్‌రెడ్డి సినిమాతో తెలుగులో మంచి హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ వంగా, అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా తెరకెక్కించారు. కబీర్ సింగ్ గత ఏడాదిలో బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ సినిమాగా రికార్డులు సృష్టించింది. కబీర్ సింగ్ హిట్‌తో సందీప్ వంగాతో భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు టీ-సిరీస్ ముందుకొచ్చింది. రణబీర్ లేదా రణవీర్‌లలో ఒకరితో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా ఆ సినిమాను సైడ్ చేసినట్లు తెలుస్తోంది.
సందీప్ వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సందీప్ వంగాతో సినిమా చేసేందుకు భారీ మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించిందట. దీంతో ప్రభాస్‌తో మూవీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలోనే టి-సిరీస్ కూడా భాగస్వామి అవుతుందన్న టాక్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే… ప్రభాస్ మాత్రం ఇప్పటికే బిజీగా ఉన్నాడు. ప్రభాస్ సందీప్ వంగాతో చేతులు కలపాలంటే మరో యేడాది సమయం ఉండటంతో… ఈ లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయబోతున్నాడు సందీప్ వంగా.