అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంతోమంది ఫిలింమేకర్స్ ను ప్రభావితం చేసింది. అప్పటికే సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న దర్శకులు సైతం కుళ్ళుకునేలా అందరినీ అకట్టుకుంది. ఎంతోమంది ప్రముఖ దర్శకులు తమకు అవకాశం ఉంటే వెనక్కి వెళ్లి తమ తొలి చిత్రాన్ని అర్జున్ రెడ్డిలా పర్పెక్ట్ గా తెరకెక్కించాలని కోరుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా నటించిన ఈ సినిమా విజయం ఒక ట్రెండ్ గా మారిపోయింది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అయ్యి.. అక్కడా ఘన విజయం సాధించింది ఈ సినిమా. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కింది.
అయితే.. టీ సిరీస్ సంస్థ నిర్మాణంలో మాతృక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడది బాక్సాఫీస్ వసూళ్లు కొల్లగొడుతోంది. ఇప్పటి వరకు 379 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ ఘన విజయమే ‘కబీర్ సింగ్’కు సీక్వెల్ చేసేందుకు నిర్మాతలు ఆలోచించేలా చేస్తుంది.
అయితే.. కబీర్ సింగ్ ది ఐకానిక్ క్యారెక్టర్ అని తెలిపారు టీ సిరీస్ మురాద్ కేతాని. దీని సీక్వెన్స్ గా రెండవ భాగం తీసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇందులోనూ నాయికగా కియారానే నటించనుందని తేల్చిచెప్పారు. కానీ.. తెలుగులో ఈ విషయంపై దర్శక నిర్మాతలు స్పందించలేదు.