దర్శకుడు శంకర్ సినిమాలు అంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాల కోసం అభిమానులు చాలా వరకు ఎదురు చూసే వారు. ఇప్పుడు ఆయన క్రేజ్ కాస్త తగ్గింది గాని ఒకప్పుడు ఆయన సినిమాలకు మంచి స్పందన ఉండేది. ఆయన్ను తెలుగు వాళ్లకు బాగా దగ్గర చేసిన సినిమా ఒకే ఒక్కడు. ఒక సాధారణ వ్యక్తి ఒక రోజు సిఎం అయితే ఏం చేస్తాడు అనేది ఈ సినిమాలో ఉంటుంది. తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయం సాధించింది.
Also Read:ప్రగతిభవన్ ముట్టడించిన కాంగ్రెస్
తర్వాత ఇదే సినిమా నాయక్ పేరుతో హిందిలో కూడా రీమేక్ చేసారు. తమిళంలో అర్జున్ ఆ పాత్ర చేస్తే హింది లో అనీల్ కపూర్ చేసారు. ఇక హీరోయిన్ గా రాణీ ముఖర్జీ చేసారు. ఇక ఈ సినిమాకు అర్జున్ విషయంలో దర్శకుడు శంకర్ చాలా కష్టపడ్డారు. ఆయన… అర్జున్ కి కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాకు ముందు అనుకున్నది వాస్తవానికి అర్జున్ ని కాదు.
రజనీ కాంత్ ని ఈ సినిమాకు ముందు హీరోగా అనుకోగా… ఆయన వేరే సినిమా కోసం ఈ సినిమాను వద్దన్నారట. ఆ తర్వాత సినిమా కథ విజయ్ కు చెప్పారట. విజయ్ అప్పటికే మూడు నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనితో అర్జున్ తో మాట్లాడగా ఆయన ఈ సినిమా చేసారు. అయితే విజయ్ అప్పుడు చేసిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి.
Also Read:కేసీఆర్ కు బండి బహిరంగ లేఖ..!