రాష్ట్రపతి భవన్ లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం 25 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డులను ప్రదానం చేశారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ అచంట శరత్ కమల్ అందుకున్నాడు. అర్జున అవార్డును అందుకున్న వారిలో మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ ఉండటం విశేషం. అర్జున అవార్డును అందుకున్న వారిలో చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద కూడా ఉన్నాడు.
President Droupadi Murmu presents the Arjuna award to Boxer Nikhat Zareen at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/5RRFpXD7Z8
— ANI (@ANI) November 30, 2022
తెలంగాణ నుంచి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ కూడా ఈ పురస్కారాన్ని అందుకుంది. భారత క్రీడా మంత్రిత్వ శాఖ నవంబర్ 14న ఈ ఏడాదికి సంబంధించిన క్రీడా పురస్కారల వివరాలను ప్రకటించింది. రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది క్రికెట్ నుంచి దినేష్ లాడ్ ఒక్కరే క్రీడా పురస్కారం అందుకున్నారు. ఈ సారి అర్జున అవార్డులకు ఎంపికైన క్రీడాకారుల్లో ఎక్కువగా కామన్వెల్త్ గ్రేమ్స్-2022లో పాల్గొని భారత్ కు పతకాలు అందించారు.
అర్జున అవార్డుల విజేతలు:
ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్), సీమా పూనియా (అథ్లెటిక్స్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (బ్యాడ్మింటన్-డఫ్).
ద్రోణాచార్య అవార్డు విజేతలు:
రెగ్యులర్ విభాగంలో ద్రోణాచార్య అవార్డులను జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్) మరియు సుజిత్ మాన్ (రెజ్లింగ్) అందుకున్నారు.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు:
ఆచంట శరత్ కమల్ ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్‌వీర్ సింగ్ (హాకీ), బీసీ సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్).
నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ అవార్డు:
ట్రాన్స్ స్టేడియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లడఖ్ స్కీ అండ్ స్నోబోర్డ్ అసోసియేషన్.
President Droupadi Murmu presents the Arjuna award to Badminton players Lakshya Sen and Prannoy HS at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/Tv4QLAPbtj
— ANI (@ANI) November 30, 2022